MuPDF(包名:free.telugu.bhakti.books)開發者是Rajneesh Gosai,MuPDF的最新版本1.0.17更新時間為2019年07月22日。3500 Free Telugu Bhakti Books的分類是圖書與參考資源,包含如下標籤:Subscriptions。您可以查看3500 Free Telugu Bhakti Books的開發者下的所有應用並找到3500 Free Telugu Bhakti Books在安卓上的4個相似應用。目前這個應用免費。該應用可以從APKFab或Google Play下載到Android 4.1+。APKFab.com的所有APK/XAPK文檔都是原始文檔並且100%安全下載的資源。
ఇంటింటా ఆధ్యాత్మిక గ్రంధాలయం
సాంకేతికత(Technology) ద్వారా సనాతన ధర్మ ప్రచారం
------------------------------------------------------------------------------------------------------------------
పరమాత్మ స్వరూపమునకు నమస్కారం,
భారత ప్రభుత్వం చేపట్టిన "డిజిటల్ లిటరసీ" ప్రేరణతో సాయి రామ్ సేవక బృందం విలువలతో కూడిన విద్య అందించాలనే ఉద్దేశ్యంతో "ఇంటింటా ఆధ్యాత్మిక గ్రంధాలయం" అనే సేవను Mobile App ద్వారా సనాతన ధర్మ సంబంద, ఉత్తమ జీవన విధానానికి కావలసిన విలువలు, నైపుణ్యాల సంబంద గ్రంధాలను ఉచితంగా అందించటం జరిగింది.
ఈ ఆప్ లో 3500 గ్రంధాలు PDF(e-Book) అందివ్వబడినాయి. ఈ గ్రంధాలను క్రింద చెప్పబడిన 33 వర్గాలుగా మా సామర్ధ్యమేరకు విభజించబడినవి.
భక్తి యోగం(429), కర్మ యోగం(48), రాజ యోగం(44), జ్ఞాన యోగం(407), రామాయణం(129), మహాభారతం(67), భగవద్గీత(68), పురాణములు(54), భాగవతము(77), వేదములు(87), ఉప వేదాలు(219), వేదాంగాలు(179), ఉప వేదాంగాలు(49), ఉపనిషత్తులు(63), గీతలు(26), ధర్మము(183), కథలు(130), శతకాలు(64), సూక్తులు(57), కావ్యాలు(31), నాటకాలు(49), కీర్తనలు(104), గేయాలు(60), దేవిదేవతలు(86), గురువులు(254), భక్తులు(47), కవులు(132), జీవిత చరిత్ర(104), మహిళలు(66), పిల్లలు(39), చరిత్ర(61), విజ్ఞానము(70), వ్యక్తిత్వ వికాసం(40)
ఈ ఆప్ ముఖ్య విశేషాలు:
- పూర్తిగా తెలుగు భాషలో లబ్యమయ్యే గ్రంధాలను మాత్రమే అందించటం
- 3500 e-Books ని PDF రూపంలో అందించటం
- పూర్తిగా ఉచితం
- గ్రంధాలను సులభంగా ఎంచుకొనుటకు 33 వర్గాలుగా(రామాయాణం,మహాభారతం,భాగవతం,వ్యక్తిత్వ వికాసం,జీవిత చరిత్ర.....) విభజించటం జరిగింది(category)
- Ads గాని, వ్యాపార ప్రకటనలు కాని లేవు, అలాగే రిజిస్ట్రేషన్ గాని అవసరం లేదు.
- English లో మీకు కావలసిన పుస్తకం వెదికే ఏర్పాటు కూడా ఉంది(search)
- మీకు నచ్చిన పుస్తకం దిగుమతి(డౌన్లోడ్) చేసుకొని, తర్వాత చదువుకోవచ్చు
- నచ్చిన పుస్తకాన్ని గుర్తు పెట్టుకొని తర్వాత చదువుకోవచ్చు (favourites)
- ఇంటర్నెట్ లేకపోయినా దిగుమతి(డౌన్లోడ్) చేసుకొన్న గ్రంధం చదువుకోగలరు(offline books)
- చివర సారిగా మీరు చదివిన గ్రంధం తిరిగి సులభంగా చదువుకోగలరు(recent read)
- ఆకర్షణీయమైన 3D Sliding సౌకర్యంతో పుస్తకం లో పేజి త్రిప్పుతూ చదివే అనుభూతి పొందగలరు
నూతన సేవలు:
- 3500 గ్రంధాలలో మీరు ఎన్ని గ్రంధాలు చదివారు, ఎన్ని డౌన్లోడ్ చేసుకొన్నారు అనే రిపోర్ట్ ఒకేచోట చూడవచ్చు (My Activity)
-మన ఆప్ లో గల సమస్యలను లేక సూచనలను మీరు నేరుగా మన సేవక బృందానికి మెయిల్ చేయవచ్చు(Comment)
-మన ధర్మం గురించి మీరు ఏమైనా గ్రంధం వ్రాసి ఉంటే, లేక పాత పుస్తకాలు(pdf) మీరు సేకరించి ఉంటే వాటిని సేవక బృందానికి
పంపించటం చాలా సులువు(Submit eBook)
-సేవక బృంద ధర్మ ప్రచార కార్యక్రమాలు, నూతన విషయాలు అందరికి తెలియచేసేలా కల్పించాము(Notification)
-మీరు ఏదైనా పూర్తిగా చదివితే ఇతరులకి share చేసే నోటిఫికేషన్ కన్పించును, దానిని వినియోగించుకొని ఇతరులకి whatsapp,మెయిల్ ద్వారా తెలియచేయగలరు
ఈ జ్ఞాన యజ్ఞానికి సహాయం చేసిన భారత ప్రభుత్వపు డిజిటల్ లైబ్రరీ, తిరుమల దేవస్థానం, అలాగే ఇతర ఉచిత సేవాసంస్థలకు మా నమస్కారాలు.
3500 Free Telugu Bhakti Books Android App User Guide(pdf)- 3500 ఉచిత తెలుగు భక్తి పుస్తకాల ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్ మార్గదర్శి(pdf) ఈ క్రింది లింక్ ద్వారా పొందవచ్చు. ఆండ్రాయిడ్ ఆప్ ను ఎలా ఉపయోగించాలో పుస్తక రూపంలో వివరించటం జరిగింది
https://archive.org/download/SaiRealAttitudeMgt/3500-FreeTeluguBhaktiBooks-AndroidApp-UserGuide.pdf
ఇట్లు,
సదా సాయినాధుని సేవలో,
సాయి రామ్ సేవక బృదం
వెబ్ సైట్: www.sairealattitudemanagement.org
సంప్రదించుటకు :
[email protected] * సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు *